Monday, April 13, 2009

naa madilo nuvvu

నా మదిలో నువ్వు లేవు

నా ఊహల్లో నువ్వు లేవు

నా కలలలో నువ్వు లేవు

అనుకుంటే నేను లేనే లేను

kanulu moosina

కనులు మూసిన కలలాయే

కలల నిండా నీవాయే

మనసు దోచిన మగువాయే

మరల ఆచూకి లేదాయే

మదిలో కలవరమాయే కలిసిన మధురము అయ్యే

nenantay naaku

నేను అంటే నాకు ఇష్టం లేదు

నా మౌనం నిన్ను కష్టపెట్టినందుకు

నేను అంటే నాకు ఇష్టం లేదు

నీ ఇష్టం నేను తెలుసుకోనందుకు

నేను అంటే నాకు ఇష్టం లేదు

నీ ఇష్టం నేను కానందుకు !!

Oka aasa

నిన్ను తొలిసారి చూసి నప్పుడు ఒక ఆశ

నీ తో మాటలాడాలని

నీతో మొదటిసారి మాటలాడినప్పుడు ఒక ఆశ

నీ తో స్నేహం చెయ్యాలని

నీ తో స్నేహం చేశాక ఒక ఆశ

మన స్నేహం శాశ్వతం అవ్వాలని

నా ఆశలు నిజం చేసిన నా నేస్తమా

నే మరువలేను నిన్ను నా శ్వాస ఉన్నంత వరకు

marachi potanemonani

నేస్తమా ఇప్పటికి నాకు తెలియదు

నా మనసులో స్వార్ధం దాగి ఉన్నది అని

జలపాతాలై జాలు వారే నా కన్నిరుని

నా మనసు స్వార్ధం తో అడ్డుకుంటోంది

తనలో దాగి ఉన్న తీపి భావాన్ని

కన్నీటి ధారలుగా మర్చి బయటకు పంపిస్తే

మనన్సు తేలిక పడి నాకు దూరమైన

నా నేస్తం చేసిన తీపి గాయాన్ని ఎక్కడ

నేను మరచి పోతానేమోనని

నా మనసు ఎంతో స్వార్ధం గా మారిపోయింది

Manasanta nuvvani

మనసంతా నువ్వని చెప్పలేను

నా మదిలో నువ్వు లేవు అన లేను

మనసన్నది ఉంటే అది నీకే

నేనంటూ ఉంటే అది నీ స్నేహం కొరకే

Raati gunday

రాతి గుండె కాకూడదు సుమా నా చెలి హృదయం

నా రూపం తన గుండెల్లో నిలుపుకోవడం కష్టమని నా భయం

మంచు పలకం కాకూడదు నా చెలి హృదయం

తన మదిలో దాచుకున్న నా రూపం కరిగిపోతుందని నా భయం

నా కవితకు స్పందిస్తే చాలు, నేను అందుకోవాలని అనుకునే నా చెలి హృదయం

naa hrudayam

నీ మదిలో నా ఫై ఉన్న చిరు కోపం
చెయ్యి నీ పెదవుల వరకే పరిమితం
నీ కన్నులను అది చేరితే
ఆ వాడిచూపుల తాకిడికి అల్లాడదా నా హృదయం

Dooram avvalani

దూరం అవ్వాలని ఉంది ,దగ్గర అవుతున్న కొద్ది

దగ్గర అవ్వాలని ఉంది,దూరం అవుతున్న కొద్ది

దూరం అవ్వాలని ఉంది నాకు దగ్గరవుతున్న నీ మౌనం నుంచి

దగ్గర అవ్వాలని ఉంది నా మనసుకు నువ్వు దూరం అవుతున్న కొద్ది

naato cheppay oosulu

నీ కళ్ళు నాతో చెప్పే ఊసులు
నా పెదవులు చదవక ముందే
నా గుండెలను చేరి గిలిగింత పెట్టాయి నేస్తం
ఆ కలవరం నా కళ్ళల్లోకి చూడు నీకే తెలుస్తుంది

nee mounam ani telisi

ఓ నేస్తమా అని నేను పిలవగానే

నిలిచిపోయిన నీ మాటలు చూసి

నే కలవరపడ్డాను ఒక్క క్షణం

ఓ నా ప్రియ నేస్తమా ..........

అనే నా మాటలు వినేందుకే నీ మౌనమని

తెలిసి సంతోషపడ్డాను మరుక్షణం

aksharalu

అక్షరాలూ

కవి చెంత అందమైన కవితగా ఒదిగి నా

గాయకుడి గళంలో ని పాటలా మారినా

లేఖలోని భావాలుగా ఇమిడినా

ఉద్యమంలో ఆయుధాలుగా సహాయపడినా

వాటి పుట్టుక ఏదో ఒక ఆశతో నిండిన

హృదయం లోనే మొదలౌతుంది

maa amma

అమ్మ నా పెదవులు పలికిన మొదటి మాట

స్నేహం అంటే ఏమిటో నేర్పిన నా తొలి నేస్తం

తన గుండెల్లో ఎప్పుడూ నన్ను దాచుకొనే నా తోడూ

నా ప్రతిఅడుగులో నా వెనువెంటే ఉండే నా నీడ

నాకు లోకం అంటే ఏమిటో నేర్పిన నా గురువు

తన అనుభవాలను అక్షరాలుగా మార్చి

నాకు పాటాలుగా నేర్పిన బడి చల్లని మా అమ్మ ఒడి

nee kannulu

చెలి నీ కన్నులు చెమ్మగిల్లిన వేళ

ఓదార్పుగా నా ఒడిలో నిన్ను చేర్చుకోన

నీ కంట నీరు రాకుండా కాటుకై కావలి ఉండనా

దాచుకుంటా నా గుండె గుడిలో నీ సేద తీరే దాక

నీకై నేను నాకై నువ్వు అనే ఉషోదయం కోసం నేను నిరీక్షిస్తాను నేస్తమా

naa ohallo ne

ఓ నేస్తమా అని నిన్ను పిలువనా

నా ప్రాణం నువ్వే అని నీకు తెలుపనా

నా ఊహల్లో నే ఇంకా నువ్వు ఉన్నా

నీ రాక కై నేను వేచి చూస్తున్నా

oka chinna prayatnam

నా మనసులోని భావాలకు ప్రతిభింబాలు నా కవితలు

ఆ మధుర భావాలకు ఊపిరి పోసేది మాత్రం నీ స్నేహమే

నా మనసుకి తెలిసిన నిన్ను నా మనసులోనే దాచుకోలేక

మన స్నేహం గురించి నా మనసుకి నచ్చిన వారితో పంచుకునే

ఒక చిన్ని ప్రయత్నం నా ఈ కవిత్వం

snehaniki gurutuga

ఓ నేస్తమా నీ రూపం నా జ్ఞాపకాలలో పదిలంగా ఉంది

నువ్వు అందించిన స్నేహం నా గుండెల్లో అందమైన ఊహగా మిగిలింది

నిన్ను చేరి ఎన్నో ఊసులు చెప్పాలని నీ జాడ కోసం వెతికాను

నువ్వు వదిలి వెళ్ళిన నీ స్నేహం తప్ప నీ ఆచూకి నాకూ దొరకలేదు

అందుకే నా గుండెల్లో ఉన్ననీతో నా మనసులోని మాటలు పంచుకుంటున్నా

నేస్తమా నా జీవిత పయనం లో నాకూ తోడుగా నిలిచింది నీ స్నేహమే

నాతో నువ్వు లేకున్నా,నీ పేరు నా ఊహలోకి వచ్చిన మరుక్షణం లో

నా పెదవుల పైన ఒక చిరునవ్వు నిలుస్తుంది

మన తియ్యని స్నేహానికి గురుతుగా

naa kavitaku

నా కవితలకు ఊపరి నువ్వని తెలియలేదు

అది తెలిసిన క్షణంలో నా చెంత నువ్వు లేవు

నా కలం నుండి జారే అక్షరాలు

నువ్వు వదిలి వెళ్ళిన నీ జ్ఞాపకాలు

Marichi poyanu

మరిచిపోయాననుకున్న నీ రూపాన్ని,

నా స్వప్నంలో నీ రూపమే ఎప్పుడూ కనిపిస్తున్న

దొరకదుఅనుకున్నాను నీ స్నేహాన్ని,

అది అందించేందుకు నువ్వే ముందుకి వస్తున్నా

ఎన్నటికీ నా పైన నీకు కోపం పోదనుకున్నాను

నువ్వు చిరునవ్వుతో నా ఎదుటే నిలిచి వున్నా

నేను అనుకున్నవి నిజం కావని తెలిసి నా

నీకు చేరువ అవ్వాలని అనుకుంటున్నా ఇది ఎన్నటికైనా జరిగేనా ?

Gaayam chestunnadi

నువ్వు ఇక రావు అనే ఊహే నాకు రాలేదు
నా ఊహల్లోనే నువ్వు ఉన్నందుకా
నా మనసుకి బాధ అంటే నే తెలియలేదు
గాయం చేస్తునది నువ్వైనందుకా.... నీ మౌనంతో