నువ్వు లేకుండా నేను ఉండలేను అని తెలియలేదు
నీ స్నేహం నాకు దూరం అయ్యేవరకు
నేను లేకుండా నువ్వూ ఉండలేవు అని తెలియలేదు
నా కోసం నువ్వు ఆ దూరాలు దాటి వచ్చేవరకు
నా మనసులో దాగి ఉన్న భావాలకు అక్షరరూపం ...నా కవిత్వం ... ఈ రూపం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను
నువ్వు లేకుండా నేను ఉండలేను అని తెలియలేదు
నీ స్నేహం నాకు దూరం అయ్యేవరకు
నేను లేకుండా నువ్వూ ఉండలేవు అని తెలియలేదు
నా కోసం నువ్వు ఆ దూరాలు దాటి వచ్చేవరకు
ఈ క్షణం ఇలాగె నా మౌనం
నాకు ఒక తోడై రాని
నీ ఙ్ఞపకాలు చేసే గాయాన్ని
నన్ను మర్చిపోని
నా మనసులోని నీ రూపాన్ని
కన్నీరులా కరిగిపోని
నా కన్నులకు తెలుసు కాలం కరిగిపోతుందని,
అందుకే ప్రతిక్షణం నిన్నే చూడమంటోంది.
నా పెదవులకు తెలుసు మౌనం నిలిచిపోదు అని,
అందుకే మళ్ళీ మళ్ళీ నీ పేరే జపించమంటోంది.
నా మనసుకి తెలుసు నువ్వు నా సొంతం కాదు అని,
అందుకే దాచుకోమంటోంది నీ స్నెహం లోని మధుర ఙ్ఞాపకాలని.
ఎదో ఒక చిన్ని ఆశ నీమాటలు వింటుంటె,
ఈక్షణం ఇలాగె నిలిచిపోవాలని.
ఎదో ఒక చిన్న భయం నీ మౌనం చూస్తుంటె,
నా స్నేహం నీ మౌనాన్ని జయిస్తుందా అని.
నాతో నువ్వే ఉన్నావనుకున్న,
నా కలలో నిన్ను చూశాక
నేను కలలోనె ఉండిపోవాలనుకుంటున్నా,
నీ మనసులో నేను లేనని తెలిశాక