Wednesday, July 30, 2008

Naa ohalaku pranam

ఓ నేస్తమా నా చెంత నువ్వు ఉంటే
నా పెదవులపైన చిరునవ్వు వుంటుంది
నీ ఓదార్పు నాకు తోడుగా ఉంటే
నా కన్నుల్లో కన్నీరుకి చోటువుండదు
నువ్వు ప్రోత్సాహం నాకు అందిస్తుంటే
నా పయనంలో ఓటమికి చోటు ఉండదు
నీ మౌనం తో నన్ను భాదిస్తూ వుంటే
నా కవితకు జీవం ఉండదు
నా ఊహలకు ప్రాణం పోస్తావని ఆశిస్తున్నాను నేస్తం.

nee sneham kosam

నీ స్నేహం నేను ఎన్నడు అడుగలేదు
నీ తోడు కావాలని నేను ఎప్పుడు కోరలేదు
నేను ఊహించని నీ స్నేహం నాకు పంచావు
నాకే తెలియకుండా నా తోడుగా నిలిచావు
నిన్ను మర్చిపొమ్మని ఇప్పుడు ఎందుకు నన్ను అడుగుతున్నావు
నన్ను వీడి పోవడానికి నా అనుమతి ఎందుకు కోరుతున్నావు
నువ్వు అల లా నన్ను కలిసి ఒక కల లా కరిగి పోయినా
నువ్వు వదిలిన నీ జ్ఞాపకాలు నిన్నే గుర్తుచేస్తున్నాయి నేస్తం
మరలా దొరకని నీ స్నేహం కోసం ఎదురు చూస్తోంది నా హృదయం

Nee sneham

నీ స్నేహం, నాకు ఎప్పుడు తోడుకావాలి అనుకునేది
నీ చిరునవ్వు, నా కన్నులో ఎప్పుడూ కొలువుండేది
నీ కన్నీరు, ఎప్పటికీ నేను చూడకూడదు అనుకునేది
నీ మౌనం, నేను ఎన్నడూ భరించలేనిది
నీ మనసు, దాని అందం ముందు ఆ వెన్నెల కూడా ఓడిపోయేది
నీ నేస్తం, అది నేనే అని గురుతుకు వచ్చి ఆనందంతో నా మనసు నిండిపోయేది

Thursday, June 12, 2008

nidura vadilo

నిదుర ఒడిలో కరిగిపోయే పసి పాపవు నీవైతే

నీకు జోల పాడే జాబిల్లిని నేనే కదా

నింగి నుండి నేలజారు వాన చినుకు నీవైతే

నిన్ను మదిలో దాచుకునే పుడమిని నేనే కదా

నీ కంటి నుండి నీటి బొట్టు నేలను చేరక ముందే

నిన్ను చేరి ఓదార్చే నీ తోడూ నేనే కద


aakasam lo chukkalu

ఆకాశంలో చుక్కలు లెక్క లేనన్ని
నా గుండెలో ఆశలు చెప్పలేనన్ని
ఆ తారలు దిగి వచ్చిన
నువ్వు నా ఎదుట నిలిచిన
నా ఆనందం చెప్పలేనంత
నా సంతోషం లెక్క లేనంత

cheekatini adiga

చీకటి ని అడిగా నీ జాడ కోసం
మబ్బుల్లో నేను వెతికా నీ నీడ కోసం
చుక్కలను అడిగా నీ ఆచూకీ ఏది అని
చివరికి నా ఊహల్లో నువ్వు సేదతీరావని
నీకు జోల పాడమని ఆ చందమామ నా తో అంది

Nestam nuvvu dooram

నేస్తం నువ్వు దూరం అయ్యే వరకు తెలియలేదు
నా మనసుకు నువ్వు ఎంతో దెగ్గరని
నా కన్నుల్లో నీళ్ళు చూసే దాకా నాకూ తెలియలేదు
నువ్వు నా చెంత లేకుంటే నేను ఉండలేను అని
నీ జ్ఞాపకాలు నాకూ తోడు గా ఉన్నాయని తెలియలేదు
నిన్ను చూడాలనే నా ఆశకు అవి ఊపిరి పోసే వరకూ

nuvvantay istam

నువ్వంటే ఇష్టమని చెప్పను ఎంత ఇష్టం అంటే
అది చెప్పలేనంత అని నీ తో చెప్పలేను కనుక
నిన్ను చూడకుండా ఉండలేనని చెప్పను
నిదురలో కనులు మూసుకుంటావుగా అంటే
నా కలలలో ఉన్నది నువ్వే అని చూపలేను కనుక

oka chiru navvu

రాసేవాన్ని కవితలు కావులే
మదిని కదిలించే మధుర భావాలను
అక్షరాల రాసులుగా చేసి వాటినే
అందమైన వరసలుగా అమర్చితే
అది చదివే వారి మది పులకించి
ఆ మధురాను భావాన్ని వారూ అనుభవిస్తే
దానికి గురుతుగా వారి పెదవుల ఫై
నిలుస్తుంది లే ఒక చిన్న చిరునవ్వు
అది చెదిరి పోదులే ఆ కవిత గురుతున్నంత వరకు

kanula toti

కనుల తోటి చెప్పలేని మాటలేదులే

నీ వాలు కళ్ళలోని ఆరాటం నే చూసాలె

నీ చూపులోని భావాన్ని అంతా

నా ఊహల బాషలోకి మార్చానులే

తెలిసింది లే నాకు ఒక నిజం

నీ నిరీక్షణలన్ని నా కోసమేనని

మన స్నేహమే నీకు ప్రాణమని

yenduku ninnu choodaganay

ఎందుకు నిన్ను చూడగానేనా మదిలో నాకే తెలియని
ఏదో ఒక పులకరింత నా మనసుకు నువ్వు దగ్గరనా?
నన్ను చూసి నీ కన్నులు మెరిసినందుకా ?
నీ స్నేహం నాకు దక్కినందుకా?
నువ్వు నాకు సొంతమైనందుకా ?
తెలుపవా నేస్తం నా ఈ అనుభూతికి అర్థం?

naa manasulono maataluanni

నా మనసులోని మాటలన్నీ మూటగట్టి చెబుతున్న
నువ్వు విన్న వినకున్న
నీకోసం ఎదురు చూసి చూసి నన్ను నేను మరచి పోయా
నువ్వు నమ్మిన నమ్మలేకున్న
నా కన్నులు మూస్తే కలలా కరిగిపోతావని కలవరపడ్డ
నువ్వు తెలుసుకున్న తెలుసుకోలేకున్న
నీ మాటల కోసం నీ నవ్వుల కోసం ఆరాటపడ్డ
నువ్వు అర్ధం చేసుకున్న చేసుకోలేకున్న
నీ తోడూ కోసం నీ స్నేహం కోసం వేచివుంటాను
నేస్తంనువ్వు ఊహించిన ఊహించలేకున్న

chiru galito

చిరు గాలితో కబురు పంపా

తెలుసుకొనుటకు నీ కుశలం

నేస్తమా తెలుపకు నీ కుశలం

అది తెలుసుకొని నే నిలువలేను

అలా అని నే నిన్ను చేరలేను

aa vaana chinuku

ఓ నేస్తం
ఆ వాన చినుకు నేను ఒక్కటే
మబ్బులకు దూరమైనపుడమిని
చేరుకున్న ఆనందం ఆ చినుకుది ఐతే
నీకు దూరం అయినా
నీ మనసుకి దగ్గిర అయిన ఆనందం నాది.

Naa kannullo aarani tadi

నా కన్నులో ఆరని తడి నువ్వు
నా గుండెల్లో మాయని గాయం నువ్వు
నా పెదవుల ఫై మౌనం నువ్వు
నా కవితకు అందని రూపం నువ్వు
నా ఊహాలు చేరలేని గమ్యం నువ్వు
నా ప్రశ్నలకు తెలియని జవాబు నువ్వు
నా సొంతం అనుకోలేని నేస్తం నువ్వు

Friday, May 9, 2008

Gundello lenanavu

గుండెల్లో లేనన్నావు
నే గురుతుకు రానన్నావు
నా స్నేహం వద్దన్నావు
నా ఊహే రాదన్నావు
మౌనంగా వుంటున్నావు
నన్ను కలవరపెడుతున్నావు
నా ఎదుటకు రానన్నావు
నన్ను ఎందుకు భాదిస్తావు
ఒకసారి నువ్వు నవ్వితే చాలు
నీ నవ్వులే హరివిల్లులు అవుతాయి
నా ఆశలకు జీవం పోస్తాయి
నీ రాకకై వేచి చూడ మంటాయి

Saturday, May 3, 2008

Amma nee odilo

అమ్మ నీ ఒడిలో సేద తీరాలని ఉంది
ఈ ఎడారిలాంటి విశ్వంలో
పయనించి అలసి పోయాను
అర్ధం కాని ప్రపంచంలో
అర్ధం చేసుకోలేని మనుషుల మధ్య
నేను ఒంటరినై మిగిలాను
పయన మెటో తెలియని జీవితంలో
దిక్కుతోచక ప్రయాణం చేస్తూ
అలసి సొలసి నీ దరికి చేరాను
నీ చల్లని ఒడిలో నన్ను దాచుకో

Mounamanay nee bhasha

నీ చూపులకు అర్ధాలు
లోతు తెలియని అగాధాలు
నువ్వు పెదవి కదిపితే గాని
తెలియవు నీ మదిలోని భావాలు
నీ చిరునవ్వులతో నా మదిని
నువ్వు కలవర పెడతావు
నీ ధరి చేరిన నన్ను చూసి
నువ్వు మౌనంగా ఉంటావు
మౌనం అనే నీ భాష అర్ధం కాక
నే మౌనంగా ఉండిపోయాను నేస్తం

Naa hrudaya vanamlo

నీవు పరిమళాలు వెద జల్లె పారిజాతానివి కావు
సుగంధాల పుట్టినిల్లైన సంపెంగావి కావు
మనసును దోచే మొగలివి కావు
మగువను ఆకట్టుకునే మల్లివి కావు
సిగలలో సింగారించుకునే సన్న జాజివి కావు
పన్నీటి జల్లులు విరజిమ్మే విరజాజివి కావు
ముద్దులోలక బోసే ముద్దబంటివి కావు
చూడ చక్కని చామంతివి కావు
గుండెలను అలరించే గులాబీ కావు
కనులకు ఇంపైన కలువవి కావు
నా హృదయ వనంలోని స్నేహ తీగకు
వికసించిన నేస్తమనే కుసుమానివి

Oka puspha vilapam

సుకుమార కుసుమాన్ని నేను
కోమలమైన నా రేకుల నిలిచింది
మంచు పన్నీరు కాదు
అది నా గుండెల్లో దాగిన కన్నీరు
లతలతో నా స్నేహం చెదిరినందుకు కాదు
భారం అయ్యింది గుండెలను చీల్చే దారం కాదు
క్షణికం అయిన నా జీవితం ముగుస్తుందని కాదు
జాలి లేని చిరుగాలి చేసినది ఈ ఘోరం
సోయగాల నా చెలి కురులను వీడాను
మరువ లేకున్నాను ఆ మధురాను భావాలను
ఓదార్చ లేకున్నాను రోదించే నా హృదయాన్ని

Yeduta nilichina

ఎదుట నిలిచిన నిన్ను చూసి
అనువైన చెదరని నా హృదయం
స్పందన లేని రాతి గుండె కాదు సుమా
నిన్ను తలచిన పులకించే నా మనసు
ఊహల్లో నిన్ను చూసి ఊగిసలాడే నా మనసు
నా ఊపిరి నువ్వేనని ఆనందించే నా మనసు
కనుల ఎదుట ఉన్నది కలో నిజమో తెలియక
సతమతమై ఒక్క క్షణం స్తంభించింది నేస్తం .

Neeti Bindhuvulu

నీటి బిందువులతో నిండినది సంద్రం
నీ ఊహలతో నిండినది నా హృదయం
అలజడి రేపేను సంద్రంలో ఎగిసే అలలు
అలలై ఎగసి పడేను చెలి నా మదిలో నీ నవ్వులు
ఆ సంద్రానికి ఎప్పుడు వచ్చునో మరి ఉప్పెన
నా హృదయం ఉప్పొంగునే చెలి నువ్వు నా ఎదుట నిలిచిన

Friday, May 2, 2008

Naa mansulo bhavalanu aksharuluga marchi mee kosam oka kavitaga

ఎగిసిపడే అలను నేను , కరిగి పోని కలవి నువ్వు
కదలి వచ్చే మేఘం నేను, అలజడి లేని ఆకాశం నువ్వు
సాగిపోయే కడలి నేను , పొంగుతున్న కవిత నువ్వు
చెరగని చిరునవ్వు నేను , చెదరని ఆశవు నువ్వు
చల్లని చిరుగాలిని నేను , అందని జాబిల్లివి నువ్వు
మెరిసే మెరుపు నేను, వీడలేని తలపువు నువ్వు
ఎదురు చూసే వాకిలి నేను , నడచి వచ్చే సొగసరి నువ్వు
నీ స్నేహం కోసమే నేను , మరి నా కోసమేనా ? నువ్వు!!