Saturday, September 26, 2015

nuvvu chenta lEni kshaNam


నువ్వు చెంత లేని క్షణం సంతోషం దరికి చేరనంటోంది
సంతోషం దూరమైన క్షణం మనసు మూగబోతోంది
మనసు మూగబోయిన క్షణం నా కలం కదలనంటోంది
కలం కదలని క్షణం మౌనమే ఒక కవితై నిన్ను రమ్మంటోంది
నేస్తమా నన్ను చేరి నా సంతోషాన్ని నాకు అందించవా

ninnu kalisE okka kshaNam kOsam

నిన్ను కలిసే ఒక్క క్షణం కోసం
ఏన్నో క్షణాలు ఎదురు చూస్తున్నా
నీకు నచ్చే కవిత కోసం
ఈ అక్షరాలను పదాలుగా మారుస్తున్నా
నీతోడుగా నేను మారడం కోసం
నన్ను నీ నీడల మార్చేస్తున్నా